ETV Bharat / state

కార్మికులను పర్మినెంట్ చేయాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన

గ్రామ పంచాయతీ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 12,750 గ్రామ పంచాయతీల్లో 46 వేల మంది కాంట్రాక్టు , ఔట్​ సోర్సింగ్, పార్ట్ టైం, ఫుల్ టైం పద్ధతుల్లో పని చేస్తున్నారు.

కార్మికులను పర్మినెంట్ చేయాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన
కార్మికులను పర్మినెంట్ చేయాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన
author img

By

Published : Aug 21, 2020, 8:51 AM IST

గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ఎంపీడీవో కార్యాలయం ముందు కార్మికులు నిరసనకు దిగారు.

సుమారు 46 వేల మంది..

రాష్ట్ర వ్యాప్తంగా 12,750 గ్రామ పంచాయతీల్లో 46 వేల మంది పంచాయతీ కార్మికులు పనిచేస్తున్నారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ తెలిపారు. అందరూ, కాంట్రాక్టు , ఔట్​ సోర్సింగ్, పార్ట్ టైం, ఫుల్ టైం పద్ధతుల్లో పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ సిబ్బందిని వెంటనే పర్మినెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం వెంటనే అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.

సిబ్బందికి వినతి పత్రం...

అనంతరం మండల పరిషత్ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్, నేతలు కోడం రమణ, రాజయ్య, కృష్ణవేణి, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : 'పాజిటివ్ కేసుల్లో 77.17 శాతం మంది కోలుకున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.