రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పరిధిలోని గ్రామాల ప్రజలను చిరుత వణికిస్తోంది. జవారిపేట, నర్సక్కపేట గ్రామాల మధ్య గల బిక్కవాగు ప్రాంతలం ఓ జింక మృతి చెందిన ఉండడాన్ని గమనించిన స్థానికులు చిరుతపులి దాడిలోనే అది మరణించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ఇల్లంతకుంట మండలం పరిధిలోని కొన్ని గ్రామాల్లో చిరుత లేగదూడలపై దాడి చేసి చంపింది. పస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యవసాయ క్షేత్రాల్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో చిరుత సంచారం గురించి తెలియడంతో వారు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులు వెంటనే చిరుతను కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: గ్రామంలో చిరుత సంచారం... భయాందోళనలో ప్రజలు