ETV Bharat / state

KTR: యాంటీ ఫంగల్ మందులను అందుబాటులోకి తీసుకొస్తామన్న కేటీఆర్​ - vemulawada recent news

బ్లాక్ ఫంగస్(Block Fungus), వైట్(White Fungus) ఫంగస్ బాధితుల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​(KTR) అన్నారు. యాంటీ ఫంగల్ మందులను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రాంతీయ ఆస్పత్రిని ప్రారంభించారు.

KTR: యాంటీ ఫంగల్ మందులను అందుబాటులోకి తీసుకొస్తామన్న కేటీఆర్​

author img

By

Published : May 28, 2021, 8:36 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 22 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాంతీయ ఆస్పత్రిని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​(KTR) ప్రారంభించారు. ఈ ప్రాంత ప్రజలకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని ఎమ్మెల్యే రమేష్ బాబు ముఖ్యమంత్రి కేసీఆర్​ను కోరిన నేపథ్యంలో వంద పడకల ఆస్పత్రిని మంజూరు చేశారని కేటీఆర్​ తెలిపారు. తుది దశ నిర్మాణ పనులను నెలరోజులుగా ఇబ్బందులు పడి వేగవంతంగా పూర్తి చేసిన కలెక్టర్ కృష్ణ భాస్కర్, వైద్యాధికారి మహేశ్​ రావును అభినందించారు.

జిల్లాలో 500 పడకలు అందుబాటులోకి

జిల్లాలో వేములవాడ ఆస్పత్రితో కలిపి 500 పడకల స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. వేములవాడ ఆస్పత్రిలో 50 పడకలతో కొవిడ్ వార్డు, అన్ని రకాల వైద్య సేవలతో పాటు మందులు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆరోగ్య సర్వేలో జిల్లాలో జ్వరం ఉన్నవారిని 3,900 మందిని గుర్తించి కిట్లు అందజేసినట్లు చెప్పారు. సిరిసిల్ల తరహా వేములవాడలో కూడా 40 లక్షల రూపాయలతో ఆక్సిజన్ ప్లాంట్​ను 10 రోజుల్లో ఏర్పాటు చేస్తామని కేటీఆర్​ హామీ ఇచ్చారు. జిల్లాలో ఒక లక్ష 22 వేల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశామన్నారు. కోటి డోసుల వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచామని, ఈ ఏడాది చివరిలోపు అందరికీ వ్యాక్సిన్​ ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు.

85 కేంద్రం అధీనంలోనే

కరోనా వచ్చి తగ్గిన వారికి వస్తున్న బ్లాక్ ఫంగస్(Block Fungus), వైట్ ఫంగస్(White Fungus) బాధితుల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. యాంటీ ఫంగల్ మందులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వైద్య నిపుణులు సూచించిన మందులు, ఇతర వైద్య సేవలను ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రపంచానికి సరిపడా వ్యాక్సిన్ మనదగ్గరే ఉత్పత్తి చేస్తున్నా 85 శాతం కేంద్రం అధీనంలోకి తీసుకుంటుందని, మిగిలిన 15 శాతంలోనే రాష్ట్రాలు, ప్రైవేట్ నిర్వాహకులు కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు.

మూడో దశపై అప్రమత్తంగా ఉండాలి

మూడో దశ కరోనా చిన్న పిల్లలకు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారని, ఇందుకు ఇప్పటినుంచే అప్రమత్తంగా ఉండాలన్నారు. వేములవాడలోని పాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని50 పడకలతో చిన్నారుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సిరిసిల్లలో కూడా ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైతే విదేశాల్లో వైద్యవిద్యను పూర్తి చేసిన వారి సేవలను ఉపయోగించుకోవాలన్నారు. హోం ఐసోలేషన్​లో ఉన్న బాధితుల కోసం వేములవాడలో కూడా టెలీ మెడిసిన్​ సేవలు ప్రారంభించామని అన్నారు.

ఇదీ చదవండి: విరించి ఆస్పత్రి కొవిడ్ చికిత్సల లైసెన్సు రద్దు చేసిన ఆరోగ్య శాఖ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.