వరుడికి కరోనా సోకడంతో వివాహం నిలిచిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన యువకుడికి ఈ నెల 23న సిద్దిపేట జిల్లా యువతితో పెళ్లి నిశ్చయమైంది.
స్వల్ప కరోనా లక్షణాలున్న వరుడు ఈ నెల 22న పరీక్ష చేయించుకున్నాడు. పాజిటివ్‌గా తేలడంతో వివాహం వాయిదా పడింది. బంధువులు, కుటుంబీకులు హోమ్ క్వారంటైన్‌లో ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది.