ETV Bharat / state

కాళేశ్వరం మూడో టీఎంసీ కాల్వ సర్వేను అడ్డుకున్న గ్రామస్థులు - కాలేశ్వరం మూడో టీఎంసీ వార్తలు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దేశాయిపల్లిలో కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ ఎత్తిపోతల కాలువ నిర్మాణ సర్వేను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఎస్సారెస్పీ వరద కాలువకు సమాంతరంగా కొత్త కాలువ కోసం నీటిపారుదల ఇంజినీరింగ్ అధికారులు దేశాయిపల్లికి చేరుకున్నారు. పునరావాస ప్యాకేజీ ప్రకటించని పక్షంలో నూతన కాలువ భూసేకరణ చేపట్టొద్దని కోరారు. సర్వే చేస్తున్న అధికారులను అడ్డుకుని వెనక్కి పంపారు.

kaleswaram
kaleswaram
author img

By

Published : Jul 20, 2021, 4:49 PM IST

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం (Kaleshwaram) ద్వారా మూడో టీఎంసీ ఎత్తిపోతలకు సన్నాహాలు చేస్తున్నారు. ఎస్​ఆర్​ఎస్పీ (SRSP) వరద కాలువకు సమాంతరంగా మరో కాలువ నిర్మాణం చేపట్టనున్నారు. దీనికోసం కరీంనగర్ జిల్లా రామడుగు, గంగాధర, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలాల్లోని భూములు సేకరించే ప్రక్రియ ప్రారంభం కావడంతో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే రెండు సార్లు భూములు కోల్పోయిన వారు ఇప్పుడు వారి భూములు, ఇళ్లు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దేశాయిపల్లిలో కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ ఎత్తిపోతల కాలువ నిర్మాణ సర్వేను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఇప్పటికే ఎస్సారెస్పీ వరద కాలువలో పాక్షికంగా నష్టపోయి తలోదిక్కు నివసిస్తున్నట్టు వెల్లడించారు. రెండో సారి పాక్షిక భూసేకరణకు ఒప్పుకోమని నిరసన తెలిపారు. ఒకవేళ ఇళ్లన్నీ భూసేకరణలో తీసుకుని పునరావాస కాలనీ నిర్మించాలని డిమాండ్ చేశారు. పునరావాస ప్యాకేజీ ప్రకటించని పక్షంలో నూతన కాలువ భూసేకరణ చేపట్టొద్దని తేల్చిచెప్పారు. సర్వే చేస్తున్న అధికారులను అడ్డుకుని వెనక్కి పంపారు.

కాళేశ్వరం ఎత్తిపోతల (Kaleshwaram Lift Irrigation) ద్వారా ఇప్పటికే రెండు టీఎంసీల నీటి ఎత్తిపోతల కొనసాగుతోంది. ప్రభుత్వం మూడో టీఎంసీ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఐతే ఇప్పటికే ఇందుకు నిర్వాసితులు భూములిచ్చేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పటికే రెండు పర్యాయాలు భూములు కోల్పోయిన రైతులు మూడోసారికి ససేమిరా అంటున్నారు. పునరావాస ప్యాకేజీ ప్రకటించని పక్షంలో నూతన కాలువ భూసేకరణ చేపట్టొద్దని కోరారు.

మరోసారి ఇచ్చేది లేదు..

2004లో ఎస్​ఆర్​ఎస్పీ వరద కాల్వ కోసం భూసేకరణలో చాలా మంది నష్టపోయామని రైతులు అంటున్నారు. ఆనాడు ఈ ప్రాంతంలో సాగు నీరు అందక ఇబ్బంది పడుతున్న తరుణంలో పరిహారం కోసం పెద్దగా ఆలోచించకుండా భూములు ఇచ్చామని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పరిహారం కోసం ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించాలని బాధితులు కంటతడి పెడుతున్నారు.

మేమెలా బతకాలి..?

వరద కాల్వ కారణంగా పంటలు చేతికి వస్తున్నాయని, ఇప్పుడు మూడో టీఎంసీ అని భూములు సేకరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. మేమెలా జీవించాలో ప్రభుత్వం సూచించాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: Kaleshwaram: కాళేశ్వరం నుంచి మూడో టీఎంసీ ఎత్తిపోతలకు భూసేకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.