ఇవీ చదవండి:హస్తాన్ని వీడారు... కమలానికి జై అంటున్నారు
'నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా నిధులివ్వలేదు' - CONGRESS
70 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్, భాజపా ప్రభుత్వాలు దేశాన్ని అప్పుల్లో ఉంచారని విమర్శించారు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. కానీ ఐదేళ్లలోనే కేసీఆర్ రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో జరిగిన బహిరంగ సభలో అన్నారు.
'నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా నిధులివ్వలేదు'
కాళేశ్వరం ప్రాజెక్టు అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఈసారి జరిగే పార్లమెంట్ ఎన్నికలు చాలా కీలకమైనవన్నారు. భాజపా, కాంగ్రెస్‌లు రైతుల అభివృద్ధి అంటూ నినాదాలకే పరిమితం చేశారని కేసీఆర్ ఒక్కరే ఆదుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో గులాబీ దళపతి అమలు చేస్తున్న పథకాలను చూసే... ఇతర రాష్ట్రాలు, కేంద్రం అనుసరిస్తోందన్నారు.
ఇవీ చదవండి:హస్తాన్ని వీడారు... కమలానికి జై అంటున్నారు
Last Updated : Mar 31, 2019, 2:41 PM IST