ETV Bharat / state

రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి అరుదైన గౌరవం - మంత్రి కేటీఆర్ లేటెస్ట్ న్యూస్

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి అరుదైన గౌరవం దక్కింది. మెరుగైన సేవలు, పారిశుద్ధ్య నిర్వహణ, స్వచ్ఛత ప్రమాణాల ప్రాతిపదికన ఆస్పత్రులకు కేంద్రం ఏటా ఇచ్చే కాయకల్ప పురస్కారాలలో ఈ ఏడాదికి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ఎంపికైంది. జిల్లా ఆస్పత్రుల విభాగంలో మొదటి స్థానంలో నిలిచి రూ.16.66 లక్షల నగదు బహుమతి అందుకోనుంది. ఆస్పత్రి వైద్యాధికారులు, సిబ్బందిని మంత్రి కేటీఆర్ అభినందించారు.

kayakalpa award to rajanna siriscilla government hospital
రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి అరుదైన గౌరవం
author img

By

Published : Sep 26, 2020, 12:10 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కాయకల్ప అవార్డులలో జిల్లా ఆస్పత్రుల విభాగంలో మొదటి స్థానం కైవసం చేసుకుంది. మెరుగైన సేవలు, పారిశుద్ధ్య నిర్వహణ, స్వచ్ఛత ప్రమాణాల ప్రాతిపదికన ఆస్పత్రులకు కేంద్రం ఏటా ఇచ్చే ఈ పురస్కారాలలో ఈ ఏడాది జిల్లా ప్రధాన ఆస్పత్రి మొదటి స్థానంలో నిలిచింది. రూ.16.66 లక్షల నగదు బహుమతి అందుకోనుంది. కాయకల్ప అవార్డు బృందం ఫిబ్రవరిలో జిల్లా ఆస్పత్రిని సందర్శించి... వైద్యులు, సిబ్బంది అందిస్తున్న సేవలు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర మౌలిక వసతులపై ఆరా తీసి ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ నివేదికలను అధ్యయనం చేసి 70 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఆస్పత్రులకు కాయకల్ప అవార్డు ప్రకటిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

అందరి కృషితోనే..

జిల్లా ఆస్పత్రుల విభాగంలో మొదటి స్థానం దక్కించుకోవడం సంతోషంగా ఉందని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.మురళీధర్ రావు ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ ప్రోత్సాహం, కలెక్టర్ సహకారం, వైద్యులు, సిబ్బంది కృషి, నిబద్ధతతో కూడిన సేవలతోనే ఈ అరుదైన గౌరవం దక్కిందని అన్నారు. ఈ ప్రోత్సాహంతో ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేసి జిల్లా ప్రజలకు అత్యంత మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.

మంత్రి కేటీఆర్ హర్షం

జిల్లా ఆస్పత్రికి కాయకల్ప అవార్డు రావడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, వైద్యాధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి సూచించారు.

కలెక్టర్ అభినందన

జిల్లా ఆస్పత్రి అందిస్తున్న మెరుగైన ప్రమాణాలతో కూడిన అత్యుత్తమ వైద్యసేవలకు కాయకల్ప అవార్డులలో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలవడం పట్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ స్పందించారు. సూపరింటెండెంట్ డా.మురళీధర్ రావు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.

ఇదీ చదవండి: ఎడతెరిపి లేని వర్షం.. తడిసి ముద్దైన భాగ్యనగరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.