రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రౌడీషీటర్ శివను మాజీ కౌన్సిలర్ వెంకటేశ్ కత్తితో దాడిచేశాడు. ఈ ఘటనలో శివకు తీవ్రగాయాలు కాగా... అతనిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శివ మృతిచెందాడు.
మున్సిపల్ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వకుండా వ్యతిరేకంగా ప్రచారం చేసినందుకే హత్యచేసినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఘటన అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: దానం చేస్తే 25లక్షలు అన్నారు.. అందినకాడికి దోచేశారు!