రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 54 రైతు వేదికల నిర్మాణం శరవేగంగా సాగుతున్నాయి. సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి, తంగళ్లపల్లి మండలాలతో పాటు బోయినపల్లి మండలంలో రైతు వేదికలను నిర్మించడానికి మంత్రి కేటీఆర్ తన సొంత నిధులను కేటాయించారు. దీంతో రైతు వేదికల నిర్మాణ పనులు జిల్లాలో శరవేగంగా కొనసాగుతున్నాయి.
రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా తంగళ్లపల్లి మండల కేంద్రంలో రైతు వేదిక నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. 10 గుంటల స్థలంలో రూ.28 లక్షలతో నిర్మించారు. లోపల సమావేశమందిరంలో కాళేశ్వరం ప్రాజెక్టు ముఖచిత్రం, వ్యవసాయానికి సంబంధించిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతుబంధు, రైతు రుణమాఫీ, 24 గంటల విద్యుత్తు, వివిధ రకాల చిత్రాలను వేయడంతో అందరినీ ఆకర్షించేలా ఉన్నాయి.
దీంతోపాటు వీర్నపల్లి, బోయినపల్లి మండల కేంద్రాల్లో మరో రెండు రైతు వేదిక నిర్మాణాలు పూర్తి చేసుకుని మంత్రుల చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.
ఇదీ చదవండి: 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్ఠి కృషితో మెరుగైన వైద్యం సాధ్యం'