రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని రుద్రంగి, చందుర్తి, కోనారావుపేట, వేములవాడ మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి సిద్ధంగా ఉన్న వరి ధాన్యమంతా తడిసి ముద్దపోయింది. బలంగా వీచిన ఈదురు గాలులకు చందుర్తి మండలంలోని పలు గ్రామాల్లోని మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి.
కోతకు సిద్ధంగా ఉన్న పొలాల్లో వరి ధాన్యం నేలపాలైంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లెదుటే నీటిపాలు కావడం వల్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చూడండి: ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష