CESS Elections Today: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సహకార విద్యుత్ సరఫరా సంఘం ఎన్నికలు.. బ్యాలెట్ పద్ధతిలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. జిల్లాలో 13 మండలాల్లో 15 డైరెక్టర్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. సిరిసిల్ల సెస్ పరిధిలో మీటర్లు కలిగిన వారు ఓటు వేయనున్నారు. జిల్లాలో మొత్తం 87,130 ఓటర్లు ఉండగా.. 75 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 202 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 252 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి 750 ఎన్నికల సిబ్బంది, 15 మంది రూట్ ఆఫీసర్లు , 1100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ జరగనుంది.
ఇవీ చదవండి: నేడు ఆర్టీసీ నూతన సూపర్ లగ్జరీ బస్సుల ప్రారంభం
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. జపాన్లో లక్షకుపైగా..