ETV Bharat / state

'భూ సేకరణ పనులు వేగవంతం చేయండి'

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు. సంబంధిత అధికారులతో కలిసి సమీక్షించిన ఆయన రైల్వే లైన్ భూ సేకరణ పెండింగ్ అంశాలపై చర్చించారు.

author img

By

Published : Jan 6, 2021, 7:20 PM IST

Boinipalli Vinod Kumar, vice-president of the State Planning Commission, was present at the media conference held at Rajanna Sirisilla district.
'భూ సేకరణ పనులు వేగవంతం చేయండి'

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైల్వే లైన్ ఏర్పాటు చేయడానికి కావలసిన భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో కలిసి రైల్వే లైన్ భూ సేకరణ పెండింగ్ అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు.

దక్షిణ కాశీ మీదుగా..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్తపల్లి - మనోహరాబాద్ వరకు వేస్తున్న రైల్వే లైన్ ట్రాక్ 17 గ్రామాల మీదుగా వెళ్తుందని .. ఈ 17 గ్రామాలకు సంబంధించిన భూ సేకరణ ప్రక్రియ పురోగతి గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత తొందరగా.. మిగిలిన భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేసి రైల్వే అధికారులకు భూములను అప్పగించాలని సూచించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ పట్టణం మీదుగా ఈ ట్రాక్ వస్తుందని తెలిపిన ఆయన ఈ నిర్మాణం ఏర్పాటైతే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు.

అక్కడ పెండింగ్

రెవెన్యూ అధికారులతో సమీక్షించి.. రైల్వే లైన్​కు అవసరమైన భూ సేకరణ చేసి అధికారులకు అప్పగించే విధంగా పక్రియను వేగవంతం చేస్తామని కలెక్టర్ కృష్ణ భాస్కర్ తెలిపారు. ఇప్పటికే సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలో రైల్వే భూ సేకరణ పూర్తి అయిందని.. వేములవాడ నియోజకవర్గ పరిధిలో ఈ ప్రక్రియ పెండింగ్​లో ఉందని వివరించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్లీడర్ రాజ శ్రీపతి రావు, రైల్వే శాఖ డిప్యూటీ సీఈ సద్ధర్మ , భూ సేకరణ ఓఎస్డీ మనోహర్, సహాయ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, ఎమ్ఎమ్ ఈస్ఈ శ్రీకాంత్, ఈఈ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు

ఇదీ చదవండి:వ్యర్థాల నుంచి విద్యుత్​కు సన్నాహాలు : నిరంజన్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.