ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తోందని భాజపా సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి ఆరోపించారు. ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు భాజపా నాయకులు ధర్నా చేశారు.
ఇప్పటికైనా ఎల్ఆర్ఎస్ను రద్దు చేసి... 131 జీవోను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ భాజపా అధ్యక్షుడు వేణు, భాజపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.