రోజుకు 50 నుంచి 60 వేల మీటర్లు...
ఒక్కోచోట ప్రత్యక్షంగా పరోక్షంగా 200 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. వీరికి రోజుకు రూ.250 వరకు సంపాదిస్తారని చెబుతున్నారు. రోజుకు 50 నుంచి 60 వేల మీటర్ల ప్రచార సామగ్రిని సిద్ధం చేస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు.
ప్రభుత్వం చొరవ చూపాలి...
బీడీలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమకు కుటుంబం గడవటం కష్టంగా ఉందని... ఈ పనిని ఏడాది పొడవునా కల్పించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని మహిళలు కోరుతున్నారు.
పలు రాష్ట్రాలకు సరఫరా...
జెండాల తయారీకి ఉపయోగించే ముతక రకం పాలిస్టర్ ఉత్పత్తికి సిరిసిల్ల కేంద్రంగా మారింది. జిల్లాలో ప్రతిరోజు 30 లక్షల మీటర్ల ముతక రకం పాలిస్టర్ ఉత్పత్తి కాగా... వీటితో జెండాలు, కండువాలు తయారుచేస్తున్నారు. ప్రచార సామగ్రి తయారీ కార్ఖానాలు సుమారు 20 వరకు ఉన్నాయి. ఇక్కడ తయారుచేసిన రాజకీయ పార్టీల జెండాలు కండువాలు గుజరాత్, దిల్లీ, ముంబై, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌కు సరఫరా చేస్తారు.
ఇవీ చూడండి:ఈటీవీ భారత్ - అరచేతిలో యావత్ జగత్