పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో చివరి రోజు ప్రాదేశిక ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. పాలకుర్తి మండలంలోని తెరాస అభ్యర్థులను గెలిపించాలని రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్‌తో పాటు తెరాస పాలకుర్తి జడ్పీటీసీ అభ్యర్థి కందుల సంధ్యారాణి ఏల్కలపల్లి ఎంపీటీసీ అభ్యర్థులు గ్రామంలో విస్తృత ప్రచారం చేపట్టారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలను చూసి తెరాస అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి తెరాస అభ్యర్థి కందుల సంధ్యారాణి ఎన్నికల అభ్యర్థి శ్రీనివాస్‌ను గెలిపించాలని కోరారు.
ఇవీ చూడండి:బ్యాటరీ పేలి ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలు