'నీరిచ్చి మా పంటపొలాలను కాపాడండి' సాగునీటిని విడుదల చేయాలంటూ పెద్దపల్లి జిల్లా రంగాపూర్ రైతులు ధర్నా నిర్వహించారు. రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. రబీలో సరిపడా నీరు లేకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఎస్సారెస్పీ డీ86 కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాకు మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మద్దతు పలికారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ధర్నాను ఆపాలని సూచించారు. నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని కర్షకులు చెప్పడంతో.. పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం చెలరేగింది. అనంతరం ఎస్సారెస్పీ అధికారులతో మాట్లాడి గొడవను సద్దుమణిగేలా చేశారు.
ఇవీ చదవండి:'నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా నిధులివ్వలేదు'