పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం హనుమంతునిపేటలో శనివారం రాత్రి పెద్దపల్లి సంచరించినట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు స్థానికుల సమాచారంతో ఆదివారం తెల్లవారు జామున హనుమంతుని పేటలో పర్యటించిన అటవీశాఖ అధికారులు పెద్దపులి అడుగులను గుర్తించారు.
రంగంపల్లిలోకి సైతం..
హనుమంతుని పేట కేంద్రంలో సంచరించిన అనంతరం పట్టణ శివారులోని రంగంపల్లిలోకి సైతం వచ్చి వెళ్లినట్లు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హనుమంతునిపేటలోని అడవిలోకి వెళ్ళినట్లు స్పష్టం చేశారు.
అప్రమత్తంగా ఉండాలి..
గ్రామంలో పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు, రైతులు, మత్సకారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అటవీశాఖ అధికారి రవిశంకర్ హెచ్చరికలు జారీ చేశారు.
ఇవీ చూడండి : పాలకుర్తిలో పెద్దపులి సంచారం... భయాందోళనలో ప్రజలు