ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వా నిర్లక్ష్యానికి తోడు ప్రకృతి కూడా అన్నదాతలపై పగబట్టింది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్రంగా(rains effect on farmers) నష్టపోతున్నారు. ఒకవైపు ధాన్యం కుప్పలు తడిసిపోతున్నా కొనుగోలు చేయడం లేదంటూ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఎమ్మెల్యే స్వగ్రామం అయిన బూరుగుపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి పోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. దాదాపు గంటసేపు రహదారిపై ఆందోళన నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే సుంకె రవి శంకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వర్షంలో అన్నదాతల అవస్థలు
అకాల వర్షానికి అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో(paddy at buying centers) ఆరబోసిన ధాన్యం కాస్తా అకాల వర్షంతో పూర్తిగా తడిసిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపెల్లి జిల్లా మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాల్లో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యం తడిసిపోయింది. మంథని మండలంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు(farmers problems at buying centers) ముత్తారం మండలం సీతంపేటలో పూర్తిగా ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మొలకెత్తిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
ధాన్యం విక్రయించడానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే మాయిశ్చర్ వచ్చేవరకు వరి ధాన్యాన్ని ఆరబెట్టాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారని రైతులు తెలిపారు. గత కొన్ని రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని(farmers problems in rains) ఆరబెడుతున్నామని వెల్లిడించారు. ఒకవైపు అకాల వర్షాలతో ధాన్యం కుప్పలు తడిసిపోతుంటే మరోవైపు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తమ బాధలను పట్టించుకోవడం లేదని వాపోయారు. ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం కాస్త(rains effect on paddy) నీటి పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆలస్యం చేస్తే ధాన్యం మొలకెత్తి అన్నదాతలకు తీరని నష్టం వాటిల్లుతుందని.. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం అన్నదాత మొరను ఆలకించాలని కోరుతున్నారు.