ETV Bharat / state

సహకార ఎన్నికల్లో కారు ఏకగ్రీవాల జోరు - TRS WIN IN PACS ELECTIONS

మంచిర్యాల జిల్లాలో సహకార సంఘాల ఎన్నికల్లో తెరాస అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆరు డైరెక్టర్​ స్థానాలు ఏకగ్రీవం కాగా... మిగితా వాటిల్లోనూ గులాబీ జెండా ఎగరేస్తామంటున్నారు తెరాస నేతలు.

PACS DIRECTORS UNANIMOUS IN MANCHIRYAL
PACS DIRECTORS UNANIMOUS IN MANCHIRYAL
author img

By

Published : Feb 9, 2020, 12:03 AM IST

ఈ నెల 15న జరగనున్న వ్యవసాయ సహకార సంఘం ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ స్వీకరణ గడువు నేటితో ముగిసింది. మంచిర్యాల సహకార సంఘానికి తెరాస అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నస్పూర్ 4వ వార్డుకు చెందిన కొయ్యల కొమురయ్య తెరాస తరఫున బరిలో దిగగా... మిగతా పార్టీల నుంచి నామినేషన్లు రాకపోవటం వల్ల ఎన్నిక ఏకగ్రీవమైంది.

దండేపల్లి మండలం గూడెంలో 13 పీఏసీఎస్ డైరెక్టర్ స్థానాలకు ఐదుగురు తెరాస అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లాలో జరగనున్న మిగతా 13 సహకార సంఘాలలో తెరాస అభ్యర్థులే విజయ కేతనం ఎగురవేస్తారని గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేశారు.

సహకార ఎన్నికల్లో కారు ఏకగ్రీవాల జోరు

ఇదీ చూడండి: మేడారం ఏర్పాట్లపై గవర్నర్, సీఎం ప్రశంసల జల్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.