పెద్దపల్లి జిల్లాలోని మంథని, హుజురాబాద్-కేశవపట్నం మార్గమద్యంలో దాదాపు రాత్రి ఒంటి గంట సమయంలో ఒక యువకుడు నిద్రమత్తులో బైక్ అదుపు తప్పి రోడ్ పక్కన ఉన్న చెట్ల పొదల్లో పడిపోయి ఉన్నాడు. కాగా అటువైపు వెళ్తున్న మంథని శాసన సభ్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు అతనిని గమనించి కార్ ఆపి ఆ యువకుడిని బయటకు తీయించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మంచినీళ్లు తాగించి అతన్ని జాగ్రత్తగా ఇంటికి వెళ్లమని చెప్పారు. యువకుడు కరీంనగర్ వాసి అని హుజురాబాద్ నుంచి కరీంనగర్‌కు వెళ్తున్నప్పుడు ఈ ఘటన జరిగిందని ఎమ్మెల్యే వివరించారు.
ఇదీ చూడండి : ఆ యాప్ సాయంతో.. సులభంగా సరకు రవాణా