ETV Bharat / state

'ఆర్​ఎఫ్​సీఎల్​ నుంచి వెలువడే దుర్వాసనతో ఎలాంటి ప్రాణహాని లేదు' - peddapalli district news

గత కొన్ని రోజులుగా రామగుండం కర్మాగారం నుంచి వెలువడుతున్న అమ్మోనియా లీకేజీపై ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ స్పందించారు. ఈ మేరకు కర్మాగారాన్ని ఆయన సందర్శించారు. ప్రజలు భయాందోళన చెందవద్దని.. ఎటువంటి అపాయం ఉండదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ammonia release from rfcl, mla korukanti chander visited rfcl
ఆర్​ఎఫ్​సీఎల్​లో అమ్మోనియా దుర్వాసన, ఆర్​ఎఫ్​సీఎల్​ను సందర్శించిన ఎమ్మెల్యే కోరుకంటి
author img

By

Published : May 20, 2021, 8:06 PM IST

Updated : May 22, 2021, 12:48 AM IST

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి విడుదలవుతున్న దుర్వాసన పట్ల ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ అన్నారు. రైతులకు యూరియా కొరత తీర్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపల్లి జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఆర్​ఎఫ్​సీఎల్​లో గత మూడు రోజులుగా దుర్వాసన రావడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఓ వైపు కరోనాతో సతమతమవుతుంటే మరో వైపు ఫ్యాక్టరీ నుంచి వెలువడే దుర్వాసనతో ప్రజలు ఊపిరాడక సతమతమయ్యారు. స్పందించిన సీపీ సత్యనారాయణ, ఎమ్మెల్యే కర్మాగారాన్ని సందర్శించారు. దుర్వాసనకు గల కారణాలను ఆర్​ఎఫ్​సీఎల్​ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఆర్​ఎఫ్​సీఎల్​లో అమ్మోనియా దుర్వాసన, ఆర్​ఎఫ్​సీఎల్​ను సందర్శించిన ఎమ్మెల్యే కోరుకంటి

భయం వద్దు

అత్యాధునిక సాంకేతికతో ప్లాంట్​ నిర్మితమైందని.. అధిక ఒత్తిడి వెలువడితే ప్లాంట్ దానంతట అదే ఆగిపోతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రజా జీవనానికి ఎలాంటి ప్రమాదం లేదని భయాందోళనలు వద్దని సూచించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామని ప్లాంట్ అధికారులు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

నిబంధనల ప్రకారమే ఉత్పత్తి

మార్చి నుంచి ఈ ఫ్యాక్టరీలో ట్రయల్ రన్ నడుస్తోందని.. దేశంలో మొత్తం 20 ఫ్యాక్టరీలు ఇదే రకమైన సాంకేతికతో నడుస్తున్నాయని ఆర్​ఎఫ్​సీఎల్​ జీఎం విజయ్​కుమార్​ అన్నారు. పర్యావరణ కాలుష్యం కాకుండా అన్ని నిబంధనల ప్రకారమే ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు. ప్రభావిత గ్రామాల ప్రజలకు ఎలాంటి ప్రాణహాని జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అమ్మెనియా, యూరియా ఉత్పత్తి ప్రారంభిస్తామని వివరించారు.

'ఆర్​ఎఫ్​సీఎల్​ నుంచి వెలువడే దుర్వాసనతో ఎలాంటి ప్రాణహాని లేదు'

ఇదీ చదవండి: ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం అందడం లేదని యువకుడి సెల్ఫీ వీడియో

Last Updated : May 22, 2021, 12:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.