ETV Bharat / state

వలస కార్మికుల ఆందోళన.. ఎమ్మెల్యే హామీతో విరమణ

author img

By

Published : May 3, 2020, 12:53 PM IST

Updated : May 3, 2020, 2:34 PM IST

రామగుండం ఎన్టీపీసీ రాజీవ్ రహదారిపై వలస కార్మికులు ఆందోళనకు దిగారు. సుమారు 4 వేల మంది కార్మికులు నిరసన చేపట్టారు. రెండ్రోజుల్లో స్వస్థలాలకు పంపించేలా ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ హామీ ఇవ్వడం వల్ల ఆందోళన విరమించారు.

Migrant workers' concern for repatriation at ramagundam
వలస కార్మికుల ఆందోళన.. ఎమ్మెల్యే హామీతో విరమణ

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో పని చేస్తున్న వలస కార్మికులు తమ తమ స్వరాష్ట్రాలకు పంపించాలంటూ ఆందోళనకు దిగారు. సుమారు 4 వేల మంది రాజీవ్ రహదారిపై బైఠాయించారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ను అడ్డగించారు.

తమను స్వస్థలాలకు పంపించాలంటూ 2 రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన ఉద్ధృతం చేయడం వల్ల పోలీసులు లాఠీఛార్జి చేసి కార్మికులను చెదరగొట్టారు.

ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌.. కార్మికులకు నచ్చజెప్పడం వల్ల ఆందోళన విరమించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 2 రోజుల్లో వారి రాష్ట్రాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి : డెంగీపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి: హైకోర్టు

Last Updated : May 3, 2020, 2:34 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.