ETV Bharat / state

ఇక్కడ వందేళ్లపైగా మట్టి గణపయ్యకు పూజలు

చిన్నా పెద్దా భేదం లేకుండా జరుపుకునే పండుగ వినాయక చవితి.  పర్యావరణ హితం కోరి ఈ సారి చాలా చోట్ల మట్టి విగ్రహాలు ప్రతిష్ఠించారు. మరి వందేళ్లకు పైగా మట్టి విగ్రాహన్నే నెలకొల్పి పూజిస్తున్న ప్రదేశం ఎక్కడుందో తెలుసా... అదే పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో.

ఇక్కడ వందేళ్లపైగా మట్టి గణపయ్యను పూజిస్తున్నారు
author img

By

Published : Sep 6, 2019, 7:29 PM IST

గణేశ్​​ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వాడవాడలా రకరకాల రూపాల్లో గణనాథులు కొలువుదీరారు.. కూరగాయలతో చేసిన వినాయకుడు, టెంకాయలతో చేసిన ఏకదంతుడు.. ఇలా రకరకాల వస్తువులతో తయారుచేసిన లంబోదరుడు భక్తుల పూజలందుకుంటున్నాడు. పెద్దపల్లి జిల్లా మంథనిలో కొలువై ఉన్న గణనాథుడు ఏళ్ల నాటి చరిత్ర కలిగి ఉన్నాడు. ఇక్కడ సుమారు 106 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏటా మట్టి వినాయకుడిని తయారు చేసి పూజించడం పరిపాటిగా వస్తోంది.

ఈ విగ్రహం చరిత్ర అలాంటిది

మంథని ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రాలను నెలవు. పట్టణంలో ఎటు చూసినా దేవాలయాలు దర్శనమిస్తాయి. ఏ పండుగొచ్చినా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుది. వినాయక చవితి వచ్చిందంటే చెప్పనక్కరలేదు. పట్టణంలోని పెంజేర్​ కట్ట హనుమాన్​ దేవాలయంలో సార్వజనిక గజానన మండలి వారు ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం ఎంతో ప్రత్యేకమైనది. ఎక్కడా లేని విధంగా ఇక్కడ సిద్ధి, బుద్ధి సమేత వినాయకుడు దర్శనమిస్తాడు. ఇక్కడ ఉత్సవాలు 1913 నుంచి ప్రారంభించినట్లు పెద్దలు చెబుతున్నారు.

స్వాతంత్య్రం ముందు నుంచి

స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి ఇక్కడ గణపయ్య ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అప్పట్లో నాగపూర్​ నుంచి రైలులో విగ్రహాన్ని తెచ్చి పూజించేవారు. ఏటా విగ్రహాన్ని ఒకే రూపంలో ఒకే ఎత్తు ఉండేలా చూసుకుంటారు. నవరాత్రి అన్నిరోజులూ విశేష పూజలు చేస్తారు. పూర్వీకుల అడుగు జాడల్లో నడుస్తూ తరాల నాటి భక్తి విశ్వాసాలను రేపటి తరానికి అందిస్తున్నారు.

ఇక్కడ వందేళ్లపైగా మట్టి గణపయ్యను పూజిస్తున్నారు
ఇదీ చూడండి: ఎక్కడ చూసినా నీవే 'ఘన'నాథ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.