పెద్దపల్లి జిల్లా మంథనిలో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహించారు. పట్టణంలోని 11 హనుమాన్ దేవాలయాలను హనుమాన్ జయంతి సందర్భంగా సర్వాంగ సుందరంగా అలంకరించారు. తమ్మి చెరువు ఒడ్డున వెలసిన ప్రాచీనమైన శక్తి హనుమాన్ దేవాలయంలో ఉదయాన్నే అభిషేకాలు నిర్వహించారు.
అనంతరం స్వామివారికి సింధూరంతో లేపనం నిర్వహించి, వెండి కవచంతో అలంకరించారు. హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా ప్రత్యేకంగా 108 తామర కమలాలతో, తులసీదళాలతో రకరకాల పుష్పాలతో స్వామివారికి అర్చనలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో భక్తులను దేవాలయంలోకి అనుమతి ఇవ్వలేదు.
కరోనా మహమ్మారిని తొలగించి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అర్చకులు పూజలు నిర్వహించారు. అర్చకులకు భక్తులు దేవాలయాలకు రాకపోవడం వల్ల హారతిలో హుండీలలో కానుకలు లేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఇదీ చూడండి: Animal Lover : లాక్డౌన్లో శునకాల ఆకలి తీరుస్తున్న దుర్గారావు