కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ జలాశయంలోకి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి పైపులైనుతో ఎత్తిపోతలు మొదలు పెట్టారు. రెండు పంపులతో సుమారు 500 క్యూసెక్యుల గోదావరి నది జలాలు నారాయణపూర్ జలాశయంలోకి చేరుతున్నాయి. ఇక్కడి నుంచి చొప్పదండి నియోజకవర్గంలోని సుమారు 70 చెరువులకు గ్రావిటీ ద్వారా సాగునీరు అందించనున్నారు.
ఆరు మండలాల్లో సుమారు 65వేల ఎకరాలకు ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లో సాగునీరు అందించేందుకు ప్రణాళిక రూపొందించారు. చొప్పదండి నియోజకవర్గంలోని మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఇటీవల ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ముఖ్యమంత్రిని కోరారు. ఆ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లంపల్లి పైపులైన్ ద్వారా నారాయణపూర్ జలాశయంలోకి నీటిని నింపేందుకు ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: పోలీస్ స్టేషన్లోనే ఎస్సీ యువకుడికి గుండు గీసిన పోలీసులు