ETV Bharat / state

అయోధ్య రామమందిరం ఆకారంలో వరిసాగు.. - Farmer innovative venture in Peddapalli district

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన ఓ రైతు వ్యవసాయ క్షేత్రం అందర్నీ ఆకర్షిస్తోంది. ప్రతి ఏడు తను వేసే పంటలో ఏదో ప్రత్యేకత ఉండేలా చూసుకునే ఈ కర్షకుడు ఈ ఏడూ ఆ వినూత్న ప్రయత్నాన్ని కొనసాగించాడు. మరి అదేంటో చూసేయండి.

peddapally district news
పెద్దపల్లి జిల్లాలో రైతు వినూత్న సాగు
author img

By

Published : Sep 22, 2020, 11:49 AM IST

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన యాదగిరి శ్రీనివాస్ అనే రైతు కొన్నేళ్లుగా అందరి కంటే భిన్నంగా ప్రకృతికి హాని కలగకుండా సేంద్రీయ వ్యవసాయం చేస్తూ లాభాలు గడిస్తున్నాడు. ఐదేళ్లుగా దేశవాళీ వరి విత్తనాలను సాగు చేస్తున్నాడు. ఒకే ఎకరంలో 120 రకాల వరి విత్తనాలు నాటి సేంద్రీయ పద్ధతిలో వాటిని సాగు చేస్తున్నాడు.

ప్రతి ఏడు తన వ్యవసాయ క్షేత్రంలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకునే శ్రీనివాస్.. గతేడాది గోమాత రూపంలో కాలాబట్టి అనే వరి వంగడాలు నాటాడు. ఈ ఏడూ ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ.. అయోధ్య రామ మందిరం ఆకారంలో ముదురు వంకాయ రంగులో ఉండే కాలాబట్టి అనే వరి రకాన్ని సాగు చేస్తున్నాడు. ప్యాడీఆర్ట్​ పేరుతో ప్రాచుర్యం పొందిన ఈ రకం నాట్లు గ్రామీణ పర్యటక రంగ అభివృద్ధికి తోడ్పడతాయని శ్రీనివాస్ చెబుతున్నాడు. తన పొలాన్ని చూసేందుకు అనేక ప్రాంతాల నుంచి రైతులు వస్తున్నారని తెలిపాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.