ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉద్యోగులకు ప్రకటించిన మాదిరిగానే రూ. 50 లక్షల జీవిత బీమా స్కీమ్‌ను జర్నలిస్టులకు సైతం వర్తింపజేయాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూపెద్దపల్లి జిల్లా గోదావరిఖని భాస్కరరావు భవన్లో సీపీఐ రామగుండం నగర సమితి, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహార దీక్షను చేపట్టారు.
నిరాహార దీక్షను సీపీఐ నగర కార్యదర్శి కనకరాజు ప్రారంభించగా... జర్నలిస్టు సంఘాల నాయకులు పిట్టల రాజేందర్, నాగపురి సత్యం, వేల్పుల నారాయణలు సంఘీభావం తెలిపారు. కరోనాతో మరణించిన యువ జర్నలిస్టు మనోజ్ కుమార్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు.
సీపీఐ, ప్రజా సంఘాల నాయకులు రమేశ్ కుమార్, రేణిగుంట్ల ప్రీతం, గడప శ్రీకాంత్, ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు గొడిశల నరేశ్, మండల శ్రీనివాస్, జనగామ మల్లేశ్, ఎలకలపల్లి సురేశ్, గాజుల అవినాశ్, మాతంగి సాగర్, అంబాల శ్రీనివాస్, రాజు, సురేశ్ తదితరులు దీక్షల్లో కూర్చున్నారు.
ఇదీ చూడండీ : కాళేశ్వరం వరప్రదాయినికి సంవత్సరం పూర్తి