హత్యకు గురైన గట్టు వామన్‌రావు దంపతులకు వ్యతిరేకంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో కొంత మంది ఆందోళన నిర్వహించారు. వామన్‌రావుకు వ్యతిరేకంగా... హత్యలో నిందితుడైన కుంట శ్రీనుకు అనుకూలంగా నిరసనకారులు నినాదాలు చేశారు.
గుంజపడుగులో దేవాలయం, బడి, గ్రామ పంచాయతీ నిర్మాణానికి వామన్‌రావు దంపతులు అడ్డుపడ్డారని ఆరోపించారు. ఊరికి సాయం చేయకుండా అభివృద్ధిని అడ్డుకున్నారన్నారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి 200 మంది న్యాయవాదులు వామన్‌రావు కుటుంబాన్ని పరామర్శించి వెళ్లారు. వారు వెళ్లిన తరువాత కొద్దిసేపటికే కొందరు ఆందోళన నిర్వహించడం చర్చనీయాంశమయింది. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు చెదరగొట్టారు.
ఇదీ చూడండి: వ్యక్తిపై కత్తిలో దాడికి దిగిన తండ్రి కొడుకులు