పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని టీటీఎస్ ఉద్యోగ వికాస కేంద్రంలో పోలీస్ ఇన్స్పెక్టర్, రైటర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రామగుండం కమిషనరేట్ అదనపు డీసీపీ రవికుమార్ పలు సలహాలు సూచనలు ఇచ్చారు. లౌడ్ స్పీకర్లు, విద్యుత్ ఏర్పాటు, నిమజ్జన కార్యక్రమాలకు నిర్వాహకులు ఆన్లైన్ విధానంలో నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని రైటర్లకు తెలిపారు. సీసీటీఎన్ఎస్, టీఎస్ కాప్స్, ఎఫ్టీఎస్సీడాట్, సీఐఎస్ఎస్, ఈ-చలాన్ కేసుల అంశాల గురించి వివరించారు.
- ఇదీ చూడండి : పేరు ఫ్రాన్సెస్కా.. ఊరు రొమేనియా.. పూజలు శివునికి!