పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఆందోళనకు దిగింది. నూతన వాహన చట్టం అమలును వెంటనే ఉపసంహరించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి చట్టం గెజిట్ పేపర్లను దగ్ధం చేశారు. నూతన చట్టం అమలుతో ప్రజలు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని నినాదాలు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని.. లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండిః శాఖలు కేటాయింపు.. హరీశ్ ఆర్థికం, కేటీఆర్ ఐటీ, పరిశ్రమలు