నిజామాబాద్ నగరంలోని కాంగ్రెస్ భవన్లో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిజమాబాద్ పార్లమెంటరీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ యూత్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఆరు సంవ త్సరాలు కావస్తున్నా ఉద్యోగ, ఉపాధి పేరుతో యువతను తప్పుదోవ పట్టింస్తోందని మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే, రాష్ట్ర ఏర్పాటుకు రాష్ట్రంలోని యువతను బలిచేసి తెరాస అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు.
తిరగబడే రోజులు వస్తున్నాయి...
ఇక నుంచి ప్రభుత్వంపై యువత తిరుగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు. ఇకనైనా యువతను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. లేని పక్షంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సాగర్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శులు వికీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.