నిజామాబాద్ నగరంలోని దుబ్బ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన భూగర్భ మురుగునీటి శుద్ధి కేంద్రం (సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్)ను జిల్లా పాలనాధికారి నారాయణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జితేశ్.వి.పాటిల్ సందర్శించారు. మున్సిపల్ ఇంజినీర్, పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లను అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు.
నీటి పంపిణీ లైన్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి:- నిరసనలు ఆకస్మికం కాదు.. విపక్షాల ప్రయోగం: మోదీ