భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రాజెక్ట్ 40 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ ప్రాంతల నుంచి వరద నీరు వస్తుండడంతో 40 గేట్ల ద్వారా 1,50,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టును సందర్శించడానికి పర్యటకులు వస్తున్నారు.
- ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1,69,885 క్యూసెక్కులు
- అవుట్ ఫ్లో 1,75,000 క్యూసెక్కులు
- ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు, 90 టీఎంసీలు
- ప్రస్తుత నీటిమట్టం 1,090.80 అడుగులు, 88.11 టీఎంసీలు
ఇదీ చదవండి : అంతర్రాష్ట్ర బస్సులు ప్రారంభం.. ఇక సుదూరాలకు.. రైట్ రైట్!