నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం రెంజర్ల గ్రామానికి చెందిన పెర్మా గౌడ్, విజయ దంపతులకు ముగ్గురు కొడుకులు. పెద్దకొడుకు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తుండగా... మిగతా ఇద్దరిలో అరుణ్ డిగ్రీ, అరవింద్ ఇంటర్ చదువుతున్నారు. నెల రోజుల క్రితం పల్సర్ బైకు కొనుగోలు చేశారు.
సర్వీసింగ్ కోసం నిజామాబాద్ వెళ్తున్న క్రమంలో ముప్కాల్ మండలం కొత్తపల్లి వద్ద జాతీయ రహదారిపై డివైడర్ ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సోదరులిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అన్నదమ్ముల మృతితో రెంజర్లలో విషాదం నెలకొంది. చేతికి అందిన కుమారులు మృతి చేదటం వల్ల ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.