ఇంటి నిర్మాణాలకు 24 గంటల్లోనే అనుమతి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా టీఎస్ బీపాస్‌ను అమల్లోకి తీసుకువచ్చింది. జూన్ 2 నుంచి అధికారికంగా ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు వస్తాయని..దానికి అనుగుణంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని నిజామాబాద్ పురపాలక సంచాలకుడు సత్యనారాయణ సూచించారు.
పురపాలక సంఘాల్లో టీఎస్ బీపాస్ మార్చి నెల నుంచి అమలు కావల్సి ఉండగా అనివార్య కారణాలతో కాలేదని సత్యనారాయణ తెలిపారు. జూన్ నుంచి పక్కాగా అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేయాలని సంచాలకుడు ఆదేశించారు. tsbpass.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా భవన నిర్మాణ అనుమతికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే 24 గంటల్లో ఇవ్వనున్నట్టు వెల్లడించారు.