ETV Bharat / state

'పసుపు రైతులను ఎంపీ అర్వింద్​ మోసం చేశారు' - telangana varthalu

నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​పై తెరాస ఎమ్మెల్సీ రాజేశ్వర్​ ధ్వజమెత్తారు. పసుపు బోర్డు తెస్తానని ఎంపీ బాండ్ పేపర్​ రాసిచ్చారని...​ తీసుకురాలేదంటే నిజామాబాద్​ రైతులే జైలుపాలు చేస్తారని పేర్కొన్నారు.

trs mlc rajeshwar
'పసుపు రైతులను ఎంపీ అర్వింద్​ మోసం చేశారు'
author img

By

Published : Apr 3, 2021, 3:57 PM IST

నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ పసుపు రైతులను మోసం చేశారని తెరాస ఎమ్మెల్సీ రాజేశ్వర్​ తీవ్రస్థాయిలో విమర్శించారు. పసుపు బోర్డు తెస్తానని ఎంపీ బాండ్​ పేపర్​ రాసి ఇచ్చారని.... తీసుకురాలేదంటే రైతులే ఆయనను జైలుపాలు చేస్తారని అన్నారు. ముఖ్యమంత్రిని ఎంపీ జైలుకు పంపిస్తా అంటున్నారన్న ఎమ్మెల్సీ... అభివృద్ధి పనులు చేసినందుకు జైల్లో వేస్తావా అని ప్రశ్నించారు.

ముందుగా పసుపు బోర్డుపై గెలిచిన నిజామాబాద్​ ప్రాంతంలో బోర్డు ఏర్పాటు చేసి... ఆ తర్వాత తమిళనాడులో హామీ ఇవ్వమని భాజపా అధిష్ఠానానికి సూచించాలని ఎంపీని కోరారు. వెంటనే సీఎం కేసీఆర్​కి మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డికి ఎంపీ అర్వింద్ క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి: పేదలకు ఆత్మగౌరవ ప్రతీకలుగా ఉండేలా ఇళ్ల నిర్మాణం: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.