పుల్వామా అమరులకు నివాళిగా నిజామాబాద్లో 'సైనికులకు సెల్యూట్' కార్యక్రమం జరిగింది. 'ఐ స్టాండ్ ఫర్ ది నేషన్' పిలుపు మేరకు ఇందూరు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఇందుకు వేదికైంది. 'నచ్చావులే' ఫేం మాధవీ లత హాజరయ్యారు.
జాతీయ గీతం ఆలపించి.. మాజీ సైనికులకు పాద పూజ నిర్వహించారు. నిమిషం పాటు మౌనం పాటించి వీరజవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.