ముగ్గురు పిల్లలు కనిపించకుండా పోయిన ఘటన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం పేపర్‌మిల్‌లో జరిగింది. గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు దీపక్ (10), సిద్ధార్థ్(8), హుజుర్(8) ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల నుంచి కనిపించడం లేదు.
వారిలో దీపక్, సిద్ధార్థ్‌లు అన్నదమ్మలు. పిల్లల ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలించారు. ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడం వల్ల పోలీసులకు సమాచారం అందించారు.
ఇదీ చూడండి: ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల మృతి