Telangana University Sports Board Problems : విశ్వవిద్యాలయానికి 'స్పోర్ట్స్ బోర్డు' తప్పనిసరి. ఉన్నత విద్యతో సమానంగా ఆటలకు ప్రాధాన్యం ఇవ్వాలి. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు పెంచుతూ.. స్పూర్తి పెంపొందించాలి. కానీ.. నిజామాబాద్ జిల్లాలో ఉన్న తెలంగాణ విశ్వవిద్యాలయంలో పరిస్థితి వేరేలా ఉంది. వర్సిటీ ఏర్పడి ఇన్నేళ్లు గడుస్తున్నా 'స్పోర్ట్స్ బోర్డు' లేదని విద్యార్థులు డిమాండ్ చేయగా ఎట్టకేలకు అధికారులు బోర్డు ఏర్పాటు చేశారు. బోర్డు ఏర్పాటు చేసి.. 20 నెలలు గడుస్తున్నా ఒక్క సమావేశం నిర్వహించలేదు.
No Funds For Telangana University Sports Board : ప్రతి వర్సిటీలో స్పోర్ట్స్ బోర్డుకు ప్రత్యేక బడ్జెట్ ఉంటుంది. ఉస్మానియా, కాకతీయ వర్సిటీల్లో ఏటా దాదాపు రూ. కోటి.... మహాత్మా గాంధీ, పాలమూరు వర్సిటీలు రూ. 40 లక్షల వరకు కేటాయిస్తున్నాయి. ఈ నిధులతో క్రీడా మైదానం అభివృద్ధి, పరికరాల కొనుగోలు, ప్రతి క్రీడాకారుడికి కిట్లు, రవాణా ఖర్చులు చెల్లిస్తారు. రాష్ట్రంలో మూడో పెద్ద వర్సిటీగా పేరున్న తెలంగాణ విశ్వవిద్యాలయంలో మాత్రం క్రీడలకు నిధులు ఇవ్వకపోవడం దురదృష్టకరం.
TU Students Problems : వర్సిటీ ఏర్పాటై పదహారేళ్లు అయినా... అభివృద్ధికి మాత్రం దూరం
యూనివర్సిటీ తరఫున ఇతర ప్రాంతాల్లో నిర్వహించే టోర్నీలకు వెళ్లే వారికి బడ్జెట్ లేదని చేతులు దులుపుకొంటున్న దుస్థితి నెలకొంది. స్పోర్ట్స్ సర్టిఫికెట్ వస్తే ఉన్నత చదువులు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఉంటుందనే ఆశతో క్రీడాకారులే సొంతంగా ఖర్చులు భరిస్తూ టోర్నీలకు హాజరవుతున్నారు. 2006లో ఏర్పడిన తెలంగాణ యూనివర్సిటీలో కొద్ది నెలల క్రితంమే స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటు చేశారు. కానీ ఆటలకు సంబంధించి ఏలాంటి సదుపాయాలను కల్పించడం లేదు. కనీసం రన్నింగ్ చేయడానికి ట్రాక్ సరిగ్గా లేదు.
"యూజీసీ (UGC) నిబంధనల మేరకు వర్సిటీలో 20- 30 ఎకరాల్లో మైదానాలు ఉండాలి. తెవివి 577 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నప్పటికీ స్టేడియం లేకపోవడం దురదృష్టకరం. కేవలం సాధారణ మైదానంతో సరిపెడుతున్నారు. జిమ్ అసలే లేదు. స్టేడియం, జిమ్ ఏర్పాటుకు విద్యార్థులు ఏళ్లుగా ఉన్నతాధికారులుకు విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇండోర్ గేమ్స్‌కు చోటు లేకపోవడంతో నిజామాబాద్ కలెక్టరేట్, నాగారంలోని మైదానాల్లో ఎంపికలు చేపడుతుంటారు. మైదానంలో మొక్కలు పెరిగి పాములు, విషపురుగులు తిరుగుతున్నాయి.' - శ్రీశైలం, తెలంగాణ విశ్వవిద్యాలయ ఎన్ఎస్యూఐ నాయకులు
TU Hostel Problems : ఇదేందయ్యా ఇది.. హాస్టలా..? సమస్యల అడ్డానా..?
తెవివి సారంగాపూర్ ప్రాంగణంలో స్పోర్ట్స్-హబ్ (University Sports Hub) ఏర్పాటు చేయాలని గతంలో అధికారులు ప్రతిపాదనలు చేశారు. ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన ఒక్క కోర్సు వర్సిటీలో లేదు. ఓయూలో ఎం. పీఈడీ, కాకతీయలో బీపీఈడీ, ఎంపీఈడీ కోర్సులు ఉన్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల్, కుమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో ఎక్కడా ఈ ఎడ్యుకేషన్ కోర్సులు అందుబాటులో లేవు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో (Telangana University) వీటిని ప్రవేశ పెట్టాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. అయినా అధికారులు ఈ కోర్సులపై దృష్టి సారించడం లేదు.
Telangana University : టీయూ పరిస్థితేంటి?.. వీసీ జైలుకెళ్లడంతో అనుమతులకు ఇబ్బందులు