తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ బక్కిని నర్సింహులు హాజరయ్యారు. నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తెచ్చేలా పనిచేయాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ చెప్పే ప్రతి అబద్ధం ప్రజలు గమనిస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఇప్పటికీ ఒక ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని నర్సింహులు ఆరోపించారు. కేవలం కమీషన్ల కోసం మాత్రమే ప్రాజెక్టును డిజైన్ చేయడం జరిగిందన్నారు. అలాగే ఎల్‌ఆర్‌ఎస్‌ను తెరపైకి తీసుకొచ్చింది.. తెరాస ప్రభుత్వం కబ్జా చేసుకున్న భూములను రెగ్యులరైజేషన్ చేసుకోవడానికి మాత్రమే అని విమర్శించారు. దీంతో సామాన్యుడు నష్టపోతున్నాడని.. వెంటనే ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని తెదేపా తరఫున డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: నారాయణపూర్ చెరువుకు సైఫన్ ఏది : తెదేపా నేత జోజిరెడ్డి