ETV Bharat / state

Telangana University : క్రీడా బోర్డు ఓకే.. మరి వసతులేవి..? - తెలంగాణలో క్రీడా వసతుల సమస్య

No Sports Facilities In Telangana University: తెలంగాణ విశ్వవిద్యాలయంలో క్రీడా సౌకర్యాల లేమి వేధిస్తోంది. సరైన వసతులు లేక విద్యార్థుల క్రీడా నైపుణ్యాలు మరుగున పడుతున్నాయి. వర్శిటీ అధికారుల అలసత్వం విద్యార్థుల పాలిట శాపంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటు చేసి నెలలు గడుస్తున్నా.. క్రీడల అభివృద్ధి ఊసే లేకుండా పోయింది. తెలంగాణ వర్శిటీలో క్రీడా వసతుల దుస్థితిపై కథనం.

play ground
play ground
author img

By

Published : Mar 30, 2023, 1:24 PM IST

తెలంగాణ యూనివర్సిటీలో.. క్రీడా సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు

No Sports Facilities In Telangana University: ప్రతి యూనివర్సిటీకి స్పోర్ట్స్ బోర్డు తప్పనిసరిగా ఉండాలి. ఆ బోర్డు ద్వారా విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం పెంచి.. స్ఫూర్తి నింపే కార్యకలాపాలు కొనసాగించాల్సి ఉంటుంది. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పడి 16 ఏళ్లు గడిచిపోయిన తర్వాత స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటు చేశారు. బోర్డు అందుబాటులోకి వచ్చి 10 నెలల పైనే అవుతున్నా.. ఒక్క సమావేశమైనా జరగలేదు. క్రీడల అభివృద్ధికి ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించలేదు. ఇటీవల విద్యార్థుల ఆందోళనలతో డైరెక్టర్‌ను మార్చడం తప్ప ఎలాంటి పురోగతి లేదు.

యూజీసీ నిబంధనల ప్రకారం 20 నుంచి 30 ఎకరాల్లో క్రీడా మైదానాలు ఉండాలి. తెలంగాణ విశ్వవిద్యాలయం 577 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నప్పటికీ.. ఒక్క మైదానం కూడా యూజీసీ నిబంధనల ప్రకారం లేకపోవడం దురదృష్టకరం. మామూలు మైదానమే క్రీడాకారులకు దిక్కయింది. స్టేడియం, జిమ్, క్రీడా పరికరాలు సమకూర్చాలని ఉన్నతాధికారులతో మొర పెట్టుకుని విద్యార్థులు అలిసిపోయారు.

Telangana University In Nizamabad: తెలంగాణ యూనివర్సిటీకి ఒకే ఒక్క ఫిజికల్ డైరెక్టర్ దిక్కయ్యారు. ఆ ఒక్కరూ ఒప్పంద పద్ధతిలో నియామకం అయ్యారు. అమ్మాయిలకు క్రీడల్లో ప్రోత్సాహం లేదు. గేమ్స్ ఇంఛార్జ్‌గా ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన అధికారే ఉండాల్సి ఉండగా.. ఇక్కడ మాత్రం అధ్యాపకులు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఆందోళన చేసినప్పుడే క్రీడా వసతులు, పరికరాల గురించి హామీలిచ్చి చేతులు దులుపుకుంటున్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో బీపెడ్ కోర్సును అందుబాటులోకి తేవాలని.. అలాగైనా కనీసం వర్సిటీ మైదానం అభివృద్ధి చెందుతుందని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు.

ఎటుచూసినా యూనివర్సిటీ క్రీడా మైదానం ఒక సాధారణ గ్రౌండ్​ లాగా కనిపిస్తోందని విద్యార్థులు వాపోయారు. ఎవరు ఈ విషయంపై పట్టించుకోవడం లేదన్నారు. ఎన్ని రకాలుగా వినతులు, ధర్నాలు చేసిన అప్పటి వరకు మాత్రమే.. అప్పడు ఏదో నామమాత్రంగానే బాగు చేస్తారు. మళ్లీ ఆ తర్వాత పరిస్థితి సాధారణమే. వీసీ తీరు విస్మయానికి గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

"జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, వీసీ యూనివర్సిటీలో ఉన్న గ్రౌండ్​ను పట్టించుకోవడం లేదు. అలాగే స్పోర్ట్స్​ డిపార్టుమెంట్​లో ముగ్గురు మాత్రమే ఉద్యోగులు​ ఉన్నారు. యూనివర్సిటీలోని ఇన్ని వందల మంది విద్యార్థులకు ఒక్క పీఈటీ ఏం సరిపోతారు. ఎటువంటి స్పోర్ట్స్​, జిమ్​ ఎక్యూప్​మెంట్​లు లేవు. ఎన్ని విన్నపాలు చేసిన, ఎన్ని లెటర్లు ఇచ్చినా, ధర్నాలు చేసినా తు.తు. మంత్రంగానే చర్యలు ఉంటున్నాయి. ఎమ్​పెడ్​, బీపెడ్​కు సంబంధించిన కోర్సులు తీసుకొని రావాలి." - విద్యార్థులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.