ETV Bharat / state

గుండెపోటుతో ఆర్టీసీ కార్మికుడు మృతి - ts rtc strike 2019

ఎడపల్లి మండలం మంగల్​ పహాడ్​కు చెందిన ఆర్టీసీ కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి అనుమతించడం లేదన్న ప్రభుత్వ నిర్ణయంతో కలత చెంది మృత్యవాతపడ్డాడని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు.

RTC worker rajendar died with heart attack
గుండెపోటుతో ఆర్టీసీ కార్మికుడు మృతి
author img

By

Published : Nov 26, 2019, 7:36 PM IST

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగల్ పహాడ్​కు చెందిన ఆర్టీసీ కార్మికుడు రాజేందర్ గుండెపోటుతో మృతి చెందాడు. బోధన్​ డిపోలో డ్రైవర్​గా పనిచేస్తున్న రాజేందర్​ ఇవాళ ఉదయం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచాడు. 52 రోజులుగా సమ్మెలో పాల్గొని... ఇవాళ విధుల్లో చేరేందుకు సన్నద్ధంగా ఉన్నాడని... ప్రభుత్వ నిర్ణయంతో కలత చెంది ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని కుటుంబ సభ్యులు విలపించారు.

హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. తోటి కార్మికుడి మృతిపట్ల ఆర్టీసీ కార్మికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరింత మంది ప్రాణాలు కోల్పోకముందే తమను విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గుండెపోటుతో ఆర్టీసీ కార్మికుడు మృతి

ఇదీ చూడండి: 'ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే... యాక్షన్​ ప్లాన్​ సిద్ధం చేస్తాం'

Intro:TG_NZB_18_26_RTC_KAARMIKUDIKI_KANNITI_NIVAALI_AVB_TS10109
()
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగల్ పహాడ్ గ్రామానికి చెందిన రాజేందర్ అనే ఆర్ టి సి కార్మికుడు ఈరోజు ఉదయం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో మరణించాడు. ఇతను బోధన్ డిపోలో డ్రైవర్ గా విడుకు నిర్వహిస్తున్నాడు. గత 53 రోజులుగా సమ్మెలో చురుగ్గా పాల్గొన్న ఆయన నిన్నటి వార్తలతో కలత చెంది గుండె పోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళగా ఈరోజు ఉదయం మరణించారు. స్వగ్రామమైన మంగళ్ పహాడ్ కి బోధన్ డిపో ఆర్టీసీ కార్మికులు వచ్చి తమతోటి కార్మికుడికి నివాళిఅర్పించారు. మహిళా కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. తాము సమ్మెను విరమించి విధుల్లోకి వస్తామన్న ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఇంకా ఎంత మంది బలిదానాలు చేయాలని వారు అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమను విధుల్లోకి తీసుకోవాలని వారు కోరారు.
Byte: అరుణ, ఆర్టీసీ కార్మికురాలు
End

Body:శివ

Conclusion:9030175921
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.