ETV Bharat / state

బస్సులో మహిళకు టికెట్​పై చార్జీ - తర్వాత ఏమైందంటే? - బస్సులో మహిళకు టికెట్ చార్జీ జారీ వివాదం

RTC Conductor Ticket Issue at Nizamabad : ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆర్టీసీ కండక్టర్ వ్యవహరిస్తున్నారని ఓ మహిళ ఆందోళన వ్యక్తంచేశారు. ఉచిత బస్సు ప్రయాణంలో ఆమెకు కండక్టర్ టికెట్ ఛార్జీ చేయడం వివాదాస్పదమైంది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్​కు ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలియజేశారు. దీంతో ఆయన వెంటనే స్పందించి సదరు కండక్టర్​పై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

Conductor Ticket charged for woman in RTC bus
RTC Conductor Ticket Issue at Nizamabad
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 10, 2023, 6:08 PM IST

Updated : Dec 10, 2023, 8:44 PM IST

RTC Conductor Ticket Issue at Nizamabad : నిజామాబాద్ నుంచి బోధన్ వెళ్లే ఆర్టీసీ బస్సులో ఓ మహిళకు కండక్టర్ టికెట్​కు ఛార్జీ వేయడం వివాదాస్పదమైంది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆర్టీసీ కండక్టర్ వ్యవహరిస్తున్నారని ఓ మహిళ ఆందోళన వ్యక్తంచేశారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్​కు(TSRTC MD Sajjanar) ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలియజేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో(Mahalakshmi Scheme) భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. కానీ ఒకరిద్దరు కండక్టర్లు బస్సుల్లో మహిళలకు టిక్కెట్లు జారీ చేస్తున్నారు.

Conductor Ticket charged for woman in RTC bus

మహాలక్ష్మి పథకం ప్రారంభోత్సవంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య గొడవ

నిజామాబాద్ జిల్లా బోధన్ డిపో పరిధిలోని ఓ కండక్టర్ తనకు టికెట్ జారీ చేసినట్లు ఓ మహిళ ఆర్టీసీ ఎండీ సజ్జనార్​కు ఎక్స్ వేదికగా ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన ఆర్టీసీ ఎండీ సదరు కండక్టర్​పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సంబంధిత కండక్టర్​కు బాధ్యతలు అప్పగించకుండా డిపో స్పేర్​లో ఉంచడం జరిగిందని, ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఎండీ సజ్జనార్ వెల్లడించారు.

  • నిజామాబాద్ జిల్లా బోధన్‌ డిపో పరిధిలో ఒక మహిళకు టికెట్ జారీ చేసిన ఘటనపై విచారణకు ఆదేశించాం. సంబంధిత కండక్టర్‌ ను డిపో స్పేర్‌ లో ఉంచడం జరిగింది. విచారణ అనంతరం ఆయనపై శాఖపరమైన చర్యలను సంస్థ తీసుకుంటుంది.

    — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Huge Crowd at RTC Bus Stand : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఈ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంతో ఆర్టీసీ ప్రాంగణాలన్నీ అతివలతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో కొన్నిచోట్ల ఘర్షణలు సైతం తలెత్తేలా పరిస్థితి నెలకొంటుంది. మరోవైపు సీటు కోసం సాహసాలే చేస్తున్న ఘటనలు లేకపోలేదు. తాజాగా నిర్మల్​ నుంచి ఆదిలాబాద్​ వెళ్లే ఆర్టీసీ బస్సులో అటువంటి ఘటనే చోటుచేసుకుంది. బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు(Passengers) పోటీపడ్డారు.

కిక్కిరిసిన నిర్మల్​ బస్టాండ్​ - సీటు కోసం డ్రైవర్​ క్యాబిన్​ ద్వారా బస్సు ఎక్కిన మహిళా ప్రయాణికులు

ప్రయాణికుల సంఖ్య ఎక్కువ ఉండడంతో బస్సులో సీటు దొరుకుతుందో లేదో అని కొందరు మహిళలు డ్రైవర్​ క్యాబిన్​ ద్వారా లోపలికి ప్రవేశించారు. దీంతో అక్కడున్న తోటి ప్రయాణికులు సైతం సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. నిర్మల్​ బస్టాండ్​లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. అయితే ఇలా చేయడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని, దయచేసి ఇలాంటి దుస్సాహసాలకు పాల్పడవద్దని అధికారులు సూచిస్తున్నారు.

Free Bus Scheme for women : ఈ పథకం చిరు ఉద్యోగాలు చేసే మహిళలకు ఎంతో మేలు చేస్తుందని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల చాలా మందికి మేలు కలుగుతుందని నెటిజన్లు(Netizens) అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాలలో చిన్న చిన్న ఉద్యోగాలు, ఇళ్లల్లో పనిచేసే వారికి, విద్యార్థినులకు డబ్బులు మిగులుతాయని చెబుతున్నారు. ఇందుకోసం ఆధార్ కార్డు చూపించి రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఫ్రీ ట్రావెల్ చేసే సౌలభ్యం చేకూర్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు వెల్లువెత్తుతున్నాయి.

ఆరు గ్యారెంటీలకు వారెంటీ లేదన్న పెద్దలకు ప్రజలు ఓటుతో చెంపచెల్లుమనిపించారు : భట్టి విక్రమార్క

రాష్ట్రంలో బీసీ బంధు స్కీమ్ నిలిపివేత - మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన

Last Updated : Dec 10, 2023, 8:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.