ETV Bharat / state

రైతు సంక్షేమం క్షేత్రస్థాయిలో అమలవుతోందా? - Special story on formers nizamabad

రైతులకు ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు చేపడుతున్నాం. దళార్లకు విక్రయించి మద్దతు ధర కంటే తక్కువ చేసి నష్టపోవద్దు... ధాన్యం కొనుగోలు విషయంలో యంత్రాంగం చెప్తున్న మాటలు ఇవి. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.

రైతుల పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్న రైస్ మిల్లర్లు

author img

By

Published : Oct 11, 2020, 2:33 PM IST

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బోధన్, వర్ని, బాన్సువాడ ప్రాంతాల్లో ఇప్పటికే వరి కోతలు మొదలయ్యాయి. కానీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాకపోవడం వల్ల దళారులు పొలాల్లో వాలిపోయి పచ్చ ధాన్యాన్ని రైతుల నుంచి తక్కువ ధరకు కొంటున్నారు.

వాతావరణం అనుకూలించక...

వాతావరణం అనుకూలించక కోసిన పంటను ఆరబెట్టుకోలేని పరిస్థితుల్లో రైతులు క్వింటాకు నాలుగు కేజీల తరుగును ఇస్తూనే రూ. 400 తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. కొనుగోలు కేంద్రాలు లేక రైతులు దళారులకు అమ్ముకుంటున్నారు. మద్దతు ధర క్వింటాకు రూ. 1,860 ఉండగా రైతులు రూ. 1,350 నుంచి రూ. 1,400 వరకు దళారికి ఇచ్చేస్తున్నారు. ఇలా అమ్ముకోవడం వల్ల తాము నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు.

చేతికొచ్చిన పంట...

ఈశాన్య రుతుపవనాలు ప్రారంభం కావడం వల్ల బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి వర్షాలు కురుస్తున్నాయి. చేతికొచ్చిన పంట ఎక్కడ దెబ్బతింటుందని రైతులు హడావుడిగా కోతలు మొదలు పెట్టారు. కోసిన పంటను ఆర పెట్టుకునేందుకు కల్లాలు లేకపోవడం వల్ల పచ్చి ధాన్యాన్ని దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రైస్ మిల్లర్లు...

రైతు పరిస్థితిని అదునుగా చేసుకొని కొందరు రైస్ మిల్లర్లు సొమ్ము చేసుకుంటున్నారు. పెట్టుబడి కూడా రాకపోగా చేసిన కష్టం కూడా వృధా అవుతుందని రైతులు వాపోతున్నారు ప్రభుత్వం తమ పరిస్థితిని అర్థం చేసుకొని మద్దతు ధర దక్కేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: మరో మూడు రోజుల పాటు వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.