పొట్టకూటికోసం విదేశాలకు వెళ్లి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఓ వ్యక్తి ఎట్టకేలకు రాష్ట్రానికి చేరుకున్నాడు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం చేంగల్‌కు చెందిన దుమాల అశోక్ పదేళ్ల కిందట మలేషియాకు వెళ్లాడు. అప్పు చేసి ఏజెంట్ ద్వారా మలేషియాకి వెళ్లిన అశోక్‌కు... సరైన పని దొరక్క నానా అవస్థలు పడ్డాడు. ఒక్క రూపాయి కూడా ఇంటికి పంపలేదు. పైగా రోడ్డు ప్రమాదంలో గాయపడి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. వ్యాధిగ్రస్తుడై తీవ్ర అవస్థలు పడుతున్న అశోక్‌ను రాష్ట్రానికి రప్పించడానికి కుటుంబసభ్యులు తెలంగాణ వెల్ఫేర్ అధ్యక్షుడు బసంత్‌రెడ్డిని కలిశారు. దిల్లీ వెళ్లి విదేశాంగ శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపగా... చివరికి అశోక్ దేశానికి చేరుకున్నాడు. అశోక్‌ను క్షేమంగా వచ్చేలా కృషి చేసినందుకు బసంత్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని కుటుంబసభ్యులు తెలిపారు.
ఇదీ చూడండి : ఆటోలో వెళ్తుంటే హెల్మెట్ లేదట...