ఈవీఎంల ద్వారా నిర్వహిస్తే మరో 26వేల బెల్ ఎం-3 యంత్రాలు అవసరమవుతాయాని సీఈఓ పేర్కొన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఒక కంట్రోల్ యూనిట్‌కు 12 బ్యాలెట్ యూనిట్లు అనుసంధానించాల్సి ఉంటుందని వెల్లడించారు. బ్యాలెట్ విధానంలో నిర్వహించాల్సి వస్తే బ్యాలెట్ నమూనా, బ్యాలెట్ బాక్స్ పరిమాణం తదితరాలను కూడా ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయానికి అనుగుణంగా పోలింగ్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్న ఆయన... బ్యాలెట్ ద్వారా నిర్వహించాల్సి వస్తే సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఈసీ నిర్ణయం వచ్చేవరకు నిజామాబాద్‌లో శిక్షణ నిలిపివేశామని... కమిషన్ నిర్ణయానికి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇవీ చూడండి:రాష్ట్రం నీటితో కళకళలాడాలి: సీఎం కేసీఆర్