ETV Bharat / state

మద్దతు ధర ఇస్తేనే

నిజామాబాద్​ జిల్లాలో ఎర్రజొన్న, పసుపు రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఈ పంటలకు మద్దతు ధర కల్పించాలనే డిమాండ్​తో శనివారం ఉదయం 11 గంటల నుంచి రహదారులపై బైఠాయించి నిరసన చేపట్టారు. ప్రభుత్వం దిగొచ్చి గిట్టుబాటు ధరను ప్రకటించేవరకు ధర్నా కొనసాగుతుందని అన్నదాతలు స్పష్టం చేశారు.

ఎర్రజొన్న రైతుల ఆందోళన
author img

By

Published : Feb 17, 2019, 6:08 AM IST

Updated : Feb 17, 2019, 9:31 AM IST

ఎర్రజొన్న రైతుల ఆందోళన
నిజామాబాద్​ జిల్లాలో మరోసారి ఎర్రజొన్న, పసుపు రైతులు ఆందోళన బాట పట్టారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన ధర్నా ఉద్రిక్తతలకు దారితీసింది. జాతీయ రహదారుల దిగ్బంధంతో రవాణా స్తంభించింది. నిరసనలతో జిల్లా హోరెత్తింది. క్వింటా ఎర్రజొన్నకు రూ.3500, పసుపు 15వేల చొప్పున కొనుగోలు చేయాలని డిమాండ్​ చేస్తూ.. జాతీయ రహదారిని దిగ్బంధించారు. పెర్కిట్, జక్రాన్​పల్లి, దర్పల్లిలో రైతులంతా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. దర్పల్లి మండల కేంద్రంలో అన్నదాతలు రోడ్లపైనే వంటలు చేసి భోజనాలు చేశారు.
undefined

పసుపు, ఎర్రజొన్న రైతులు ఆందోళన చేయటం ఈనెలలో ఇది మూడోసారి. ఫిబ్రవరి 7, 12 తేదీల్లో ధర్నాలు చేసినా.. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం వల్ల మళ్లీ రహదారులను ముట్టడించారు. ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించకపోవటం దారుణమని రైతులు వాపోయారు. రైతుల నిరసనల నేపథ్యంలో పోలీసులు ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చూశారు. ప్రభుత్వం దిగొచ్చి పంటలను మద్దతు ధరకు కొనేవరకు ఆందోళన కొనసాగుతుందని అన్నదాతలు స్పష్టం చేశారు.

Intro:TG_Mbnr_14_16_Manyamkonda_Gramotsavam_AB_C4

( ) మహబూబ్ నగర్ జిల్లాలోని మన్యంకొండ దేవస్థానం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండోరోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం తరఫున పట్టు బట్టలు సమర్పించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపును ప్రారంభించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కళ్యాణ మండపం నుంచి స్వామివారి గ్రామోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన శకటం లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని ఊరేగించారు.

Body:తితిదే కళ్యాణ మండపం నుంచి ప్రారంభమైన ఊరేగింపు విద్యుత్ దీపాలంకరణ మధ్య స్వామివారి శోభ యాత్ర నిర్వహించారు. తిరితే తిరుపతి.. తిరక పోతే మన్యంకొండ.. అని భావించే పేదలు వందల ఏళ్ల నుంచి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మరిన్ని నిధులు కేటాయించి దినదినాభివృద్ధి ఎంతో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు కేటాయించి.. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు వివరించారు.

Conclusion:బైట్
శ్రీనివాస్ గౌడ్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే
Last Updated : Feb 17, 2019, 9:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.