సోమవారం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రజావాణికి 130 ఫిర్యాదులు అందాయి. కరోనా కారణంగా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా నిర్వహించడం లేదు.
కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టె ద్వారా 71, ఫోన్ ద్వారా 34, వాట్సప్ నుంచి 21, ఈ-మెయిల్ ద్వారా 13 ఫిర్యాదులు అందగా... డీఆర్డీవో కార్యాలయం నుంచి ఫోన్ ద్వారా మూడు ఫిర్యాదులు వచ్చాయి. మొత్తం 130 ఫిర్యాదులు స్వీకరించామని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు.