ETV Bharat / state

'పసుపుపై రాజకీయాలు మానుకోండి.. కనీస ధరనైనా పెంచండి' - పసుపు ధర

తగ్గిన ధరలను వెంటనే పెంచాలని డిమాండ్​ చేస్తూ నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్​లో.. పసుపు రైతులు ఆందోళన చేపట్టారు. కేంద్రం.. బోర్డు ఏర్పాటు అసాధ్యమని ప్రకటించిన వెంటనే దళారులు కుమ్మక్కయ్యారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరను రూ. 6 వేల నుంచి 4 వేల వరకు తగ్గించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

pasupu Farmers expressed concerns in Nizamabad Agricultural Market
'పసుపుపై రాజకీయాలు మానుకొండి.. కనీసం ధరనైనా పెంచండి'
author img

By

Published : Mar 18, 2021, 2:22 PM IST

పసుపు బోర్డు సాధించలేకపోయిన ఎంపీ అర్వింద్.. తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని రైతులు డిమాండ్​ చేశారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్​లో.. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.

కేంద్రం.. బోర్డు ఏర్పాటు అసాధ్యమని ప్రకటించిన వెంటనే దళారులు కుమ్మక్కయ్యారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు ధరను రూ. 6 వేల నుంచి 4 వేల వరకు తగ్గించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పసుపుపై రాజకీయాలు మానుకొని.. బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కనీసం.. మద్దతు ధరనైనా కల్పించాలని కోరారు. రెండు, మూడు క్వింటాళ్లకు రూ.10 వేల ధర ఇచ్చి.. మీడియాలో పసుపునకు మంచి ధర వచ్చిందని చెప్పుకోవటం సరైన పద్ధతి కాదన్నారు. డిమాండ్​లను పరిష్కరించకపోతే.. పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: బడ్జెట్​: పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.29,271 కోట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.