పిల్లలు.. చదువుతో పాటు క్రీడలు నేర్చుకోవడం వల్ల మానసిక ఉల్లాసం, శారీరక పటుత్వం కలుగుతుందన్నారు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఎం. రామ్మోహన్రావు. జిల్లా కేంద్రంలో ఒలంపిక్ రన్‌ను కలెక్టర్, ఎమ్మెల్యే బీగాల గణేశ్ గుప్తా జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్లో విద్యార్థులు, క్రీడా సంఘాల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆటలతో యువతలో క్రీడా స్ఫూర్తి ఏర్పడుతుందని కలెక్టర్ అన్నారు. వివిధ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులను సన్మానించారు.
ఇవీ చూడండి: రేవంత్ రెడ్డి కాస్త వెరైటీ..!